: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు నమోదు
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాగా, శిల్పాశెట్టి దంపతులకు చెందిన హోమ్ షాపింగ్ ఛానెల్ ‘బెస్ట్ డీల్ టీవీ’కి, విక్రయదారులకు మధ్య చెల్లింపుల వివాదం ఈ ఏడాది ప్రారంభం నుంచి నడుస్తోంది. చెల్లింపుల విషయమై సదరు సంస్థ తమను మోసగించిందని, పెద్దనోట్ల రద్దు ప్రకటించిన నాటి నుంచి తమకు పైసా కూడా చెల్లించలేదని విక్రయదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు విన్నవించుకున్నా శిల్పాశెట్టి దంపతులు పట్టించుకోలేదని విక్రయదారులు వాపోతున్నారు.