: ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న జాతి మనది: సీఎం కేసీఆర్
ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న జాతి మనదని సీఎం కేసీఆర్ అన్నారు. అంతా కలిసి పట్టుబట్టాలని, జట్టుకట్టాలని రాష్ట్రాభివృద్ధి సాధిస్తామని అన్నారు. ఈ రోజు ఆయన వరంగల్ బహిరంగ సభలో మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులంతా సమైక్యంగా గ్రామ రైతుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అలాగే జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు కావాలని ఆయన పేర్కొన్నారు. మద్దతు ధర కోసం వారంతా డిమాండ్ చేయాలని అన్నారు.
మార్కెట్లో మద్దతు ధర దొరకకపోతే తామే సొంతంగా విక్రయాలు జరుపుతామని చెప్పి, ఆ పని చేసి చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తోందని అన్నారు. ఎరువుల కోసం ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకూ ఇస్తామని ఆయన అన్నారు. మే 15లోగా తొలి పంటకు బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్పారు.