: మనముండేందుకు మరో గ్రహం!?


మనం నివసిస్తుండే భూమి దీర్ఘకాలంలో ఇరుకుగా మారబోతోంది. దీంతో ఇప్పటికే మరో ఆవాస ప్రాంతంకోసం మన శాస్త్రవేత్తలు అన్వేషణ ప్రారంభించేశారు. ఇందులో భాగంగా అరుణ గ్రహం గురించి ఆరాతీయడం ప్రారంభించారు. చాలాకాలం కిందట అంగారకుడి నుండి భూమివైపుకు కొన్ని ఉల్కలు వచ్చి పడ్డాయి. దీంతో వీటిపై శాస్త్రవేత్తలు పరిశోధన ప్రారంభించారు. ఈ శకలాల్లో భూమిలాంటి లక్షణాలున్నట్టు కనుగొన్నారు.

కొన్ని వందల ఏళ్లకిందట అంగారకుడి గ్రహంపై ఏర్పడిన శకలాలపై చేస్తున్న పరిశోధనల వల్ల వాటిలోని నీటి ఉనికి, ఖనిజాలు, రసాయన సంకేతాలు తదితర అంశాల గురించి తెలుసుకోవచ్చని, ఫలితంగా అరుణగ్రహం ఆవాసయోగ్యతను గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఆ శకలాలు అంగారకుడిపైనుండి భూమిపై పడి చాలాకాలం అయింది కాబట్టి ఆ శకలాల్లో అంగారకుడిపై ఉన్న కాలానికి సంబంధించిన సంకేతాలు మరుగున పడిపోతాయని మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మైఖేల్‌ వెల్బెల్‌ అంటున్నారు. అయితే ఇలాంటి శకలాలు భూమిపైకి రావడానికి ముందే వాటి రసాయన సంకేతాలను గనుక పట్టుకోగలిగితే అప్పుడు అంగారకుడికి సంబంధించిన ఆవాస యోగ్యతా లక్షణాలను గురించి తెలుసుకోవచ్చని ఆయన అంటున్నారు. ఈ పరిశోధన పూర్తయి అంగారకుడు కూడా మన ఆవాసయోగ్యుడేనని తేలితే ఇక అక్కడ కూడా మనం ఎంచక్కా వుండచ్చుకదా...!

  • Loading...

More Telugu News