: ప్రకాశం జిల్లాలో భారీ వర్షం.. ఈదురుగాలులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు!
ప్రకాశం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రానున్న మూడు, నాలుగు గంటల్లో భారీ ఈదురుగాలులు వీచవచ్చని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ చంద్ సూచించారు. కాగా, అద్దంకి, పెద్దారవీడు మండలాల్లో భారీగా ఈదురు గాలులు వీయగా, చెట్లమడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పర్యవసానంగా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బోయలపల్లిలో పిడుగుపడి ఆరు గేదెలు మృతి చెందాయి.