: రెండు గంటలపాటు... ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన మంత్రి కేటీఆర్
వరంగల్‌లోని హన్మకొండ ప్రకాశ్‌రెడ్డి పేటలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభకు లక్షల మంది టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు చేరుకున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు అక్కడకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. టీఆర్ఎస్ సభకు వాహనాలపై ప్రజలు భారీగా తరలివస్తుండడంతో జనగాంలోని స్టేషన్ ఘన్‌పూర్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆ ట్రాఫిక్‌లోనే మంత్రి కేటీఆర్ రెండు గంటలపాటు చిక్కుకుపోయారు. మరోవైపు మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ట్రాఫిక్ లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో కొన్ని వాహనాలు వెనుదిరుగుతున్నాయి.