: ముఖంపై కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ 'ఇట్స్ షో టైం' అంటున్న ప్రభాస్... ‘సాహో’ టీజర్ అదుర్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ టీజర్ ను విడుదల చేశారు. ముఖంపై కారుతోన్న రక్తపు మరకలను తుడుచుకుంటూ 'ఇట్స్ షో టైం' అంటూ ప్రభాస్ చెబుతున్న డైలాగుకు ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో ఈ సాహో సినిమా రూపుదిద్దుకుంటోంది. బాహుబలి సినిమా విడుదలవుతున్న థియేటర్లలోనూ ఈ సాహో టీజర్‌ను ప్రదర్శించనున్నారు. యూ ట్యూబ్ లో ఈ టీజర్ టాప్ ట్రెండింగ్ లో ఒకటిగా ఉందని యూవీ క్రియేషన్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.