: ఆ మంత్రులను అనర్హులుగా ప్రకటించాలి: రేవంత్ రెడ్డి
మంత్రులు కూలీ పని చేసి జీతం తీసుకోవడం చట్ట విరుద్ధమని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, కూలీ చేసి డబ్బులు తీసుకున్న మంత్రులను అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఓయూలో జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలు, రైతు ఆత్మహత్యల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ఉత్సవాలకు తమను ఆహ్వానించలేదని ఆయన మండిపడ్డారు. ఏ రైతు రాజు అయ్యాడో కేసీఆర్ చెప్పాలని, రాష్ట్రంలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం సీఎంకు తెలుసా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.