: 90 రోజుల్లోనే డొనాల్డ్ ట్రంప్‌కు భారీగా తగ్గిన ఆదరణ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు దాటిన సందర్భంగా టైమ్-సర్వేమంకీ ఓ ఒపీనియన్ పోల్ నిర్వహించి, అమెరికన్ల అభిప్రాయాలను సేకరించింది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ చేసిన హామీలు నెరవేరుతాయా? అని అడిగిన ప్రశ్నకు అమెరికన్లు 'నో' అనే సమాధానమే అధికంగా చెప్పారు. కేవలం 25 శాతం అమెరికన్లే ఇందుకు 'ఎస్' చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇటువంటి సర్వే నిర్వహించారు. అయితే, అప్పట్లో 31 శాతం మంది ట్రంప్ హామీలు నెరవేరుస్తారని అభిప్రాయపడగా.. ఈ తాజా సర్వేలో మాత్రం మరో ఆరు శాతం మంది ప్రజలు ట్రంప్‌పై విశ్వాసం ప్రకటించలేకపోయారు. మరో రెండు రోజుల్లో (ఈ నెల 29తో) డొనాల్డ్ ట్రంప్ వంద రోజుల పాలన పూర్తి కానుంది.