: ఇకపై ఉచిత కాల్స్, డేటా ఆఫర్లు ఉండబోవు?


ఉచిత మంత్రంతో టెలికాం రంగంలోకి ప్ర‌వేశించి మిగ‌తా కంపెనీల‌న్నింటికీ న‌ష్టాలు వ‌చ్చేలా చేసిన రిలయన్స్ జియో ప్ర‌భావంతో ట్రాయ్ ఇక‌పై కొత్త ఆప‌రేటర్ల‌కు ప‌లు నిబంధ‌న‌ల‌ను పెట్టాల‌ని యోచిస్తోంది. సిగ్న‌ల్ టెస్టింగ్ అంటూ జియో ఉచితంగా కాల్స్‌, డేటా స‌ర్వీసుల‌ని అందించిన విష‌యం తెలిసిందే. ఇక‌పై టెలికాం మార్కెట్లోకి వ‌చ్చే కొత్త కంపెనీలు ఇలా ఉచిత మంత్రాన్ని జ‌‌పించ‌కుండా ట్రాయ్‌ కొత్త నిబంధ‌న‌ల‌ను రూపొందించ‌నుంది.

ఈ మేర‌కు వ‌చ్చేనెల సంప్ర‌దింపుల ప్ర‌క్రియ చేపట్టాల‌ని యోచిస్తోంది. కొత్త ఆప‌రేట‌ర్‌లు సిగ్న‌ల్‌ను ప‌రీక్షించే స‌మ‌యంలో ఆ ఆప‌రేట‌ర్‌కు గ‌రిష్ఠంగా ఎంత మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉండాలనే అంశంతో పాటు, ఆ సిగ్న‌ల్‌ను ఎంత‌కాలం ప‌రీక్షించాలన్న‌వాటిపై నిబంధ‌న‌ల‌ను విధించనుంది. అంతేకాదు, ఆ స‌ర్వీసుల‌ను కూడా ఫ్రీగా ఇవ్వాలా? వ‌ద్దా? అన్న అంశంపై కూడా ట్రాయ్ ఆలోచిస్తోంది. జియో త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఆరు నెల‌ల పాటు ఉచిత స‌ర్వీసుని అందించ‌డంతో మిగ‌తా కంపెనీల నుంచి ట్రాయ్‌కు ఎన్నో ఫిర్యాదులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News