: టీఆర్ఎస్ డ్రామా కంపెనీగా మారింది: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్


సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత కేసీఆర్ దేనని, టీఆర్ఎస్ పార్టీ ఓ డ్రామా కంపెనీలా మారిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎకరాకు రూ.8 వేలు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారని, ఈ హామీని ఈ ఖరీఫ్ నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని, లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తామని అన్నారు. 

  • Loading...

More Telugu News