: గుంతకల్లులో చెప్పులతో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు!


అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగు తమ్ముళ్లు చెప్పులతో కొట్టుకున్నారు. ఈ రోజు జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. నాయకులు మస్తానయ్య, రామాంజనేయులు వర్గాల వారు బాహాబాహీ తలపడ్డారు. రెండు వర్గాల వారిని ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి మస్తానయ్య ఇటీవలే వచ్చారు. అయితే, సమావేశానికి ‘నువ్వు ఎందుకు వస్తావు?’ అని మస్తానయ్యను రామాంజనేయులు ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలై, పరస్పర దాడులకు దారితీసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News