: బీజేపీ మంచి ఎంపీని కోల్పోయింది: వెంకయ్యనాయుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా మృతిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ మంచి నటుడిని, బీజీేపీ మంచి ఎంపీని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్ ఖన్నా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పారు. కాగా, 2014లో గురుదాస్ పూర్ నుంచి ఎంపీగా గెలిచి ఆయన పార్లమెంటులో అడుగుపెట్టారు.