: టీఆర్ఎస్‌కు కొత్త అర్థం చెప్పిన ఎంపీ కవిత!
తమది రైతుల ప్రభుత్వం అని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. ఈ రోజు వరంగల్‌లో మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రైతు సమితి అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారని కవిత అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దూసుకుపోతోందని అన్నారు. వరంగల్ లో నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం కోసం రైతులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాల గురించి నేటి సభలో కేసీఆర్ వివరిస్తారని ఆమె అన్నారు. అలాగే రాష్ట్రంలో భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలను గురించి ప్రకటన చేస్తారని చెప్పారు.