: కూకట్ పల్లిలో భారీ చోరీ



హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలో ఉన్న ఈనాడు కాలనీలో నిన్న అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక ముక్తా నివాస్ లోని ఫ్లాట్ నంబర్-403లో నివాసం ఉన్నవారు తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు... అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో ఉన్న 45 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి సామాగ్రితో పాటు లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు. ఈ విషయాన్ని ఉదయం గమనించిన కొందరు పొరుగువారు బాధితులకు సమాచారం అందించారు. దీంతో, వారు ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

  • Loading...

More Telugu News