: టారాయి స్థానిక ఎన్నికల్లో భారతీయులు పోటీ చేసేందుకు నేపాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


నేపాల్‌తో సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ లలోని కొన్ని ప్రాంతాలను కలిపి టారాయి ప్రాంతంగా పిలుస్తారు. ఆ ప్రాంతంలో నివసించే భారతీయులకు ఇకపై స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తూ నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలోనే అక్కడి స్థానిక సంస్థలకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తమకు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని గత ఏడు నెలలుగా అక్క‌డి మదేసీలు అనే తెగవారు ఆందోళ‌న చేస్తున్నారు. ఈ అంశంపై భారతీయ దౌత్య వేత్తలు కూడా స్పందించి నేపాల్‌తో చ‌ర్చించ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించి.. వీరికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ విష‌యంపై ఆ దేశ పార్ల‌మెంటులో స‌వ‌ర‌ణ చేయనున్నారు.

  • Loading...

More Telugu News