: ఈసీకి ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసులు
ఎన్నికల సంఘానికి ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరిలో వికాస్ నగర్ ఉప ఎన్నికలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవ్ ప్రభాత్ హైకోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన హైకోర్టు... రాష్ట్ర ఎన్నికల సంఘానికి, వికాస్ నగర్ బీజేపీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, ఈవీఎంలను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది.