: పార్టీ నేతలందరినీ తన ఇంటికి రమ్మని ఆదేశించిన కేజ్రీవాల్
ఆప్ నేతలందరినీ తన ఇంటికి రమ్మని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ పరాజయం పాలవడంతో ఆ పార్టీ నేతలంతా ఆత్మరక్షణలో పడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకున్న పార్టీకి... ఇంతలోనే ఢిల్లీ ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఆప్ లో రాజీనామాల పర్వం మొదలైంది. దీంతో, తమ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కేజ్రీవాల్ వారితో భేటీ కావాలని నిర్ణయించారు. పార్టీ నేతలందరినీ తన ఇంటికి రావాలని ఆదేశించారు.