: 'మిస్ టీన్ యూనివర్స్'గా భారతీయ యువతి
ప్రతిష్ఠాత్మక మిస్ టీన్ యూనివర్స్-2017గా నోయిడా అమ్మాయి సృష్టి కౌర్ నిలిచి దేశఖ్యాతిని నలుదిశలా చాటింది. మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించే ప్రతినిధులు మిస్ టీన్ యూనివర్స్ పోటీలు నిర్వహిస్తుండగా, ఈ పోటీల్లో పాల్గొనేందుకు 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు. అఫ్రికా దేశమైన మనగ్వా రాజధాని నికరగ్వలోని రూబెన్ డారియో నేషనల్ థియేటర్ లో ఈ పోటీలు నిర్వహించగా, ఫైనల్స్ లో 25 మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టిన సృష్టి కౌర్ మిస్ టీన్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.
లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ లో విద్యనభ్యసిస్తున్న సృష్టి కౌర్ కేవలం మిస్ టీన్ యూనివర్స్ గా నిలవడమే కాకుండా జాతీయ పక్షి నెమలి అలంకరణలో ప్రదర్శన ఇచ్చి, బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ విభాగంలో అవార్డును కూడా సొంతం చేసుకుంది. కెనడాకు చెందిన సమంత పిర్రే, మెక్సికోకు చెందిన అరి ట్రావ ఫస్ట్ అండ్ సెకెండ్ రన్నరప్ లుగా నిలిచారు.