: బాహుబలి-2లో అతిపెద్ద సీక్రెట్ ఇదే... సోషల్ మీడియాలో ప్రచారం!
సినీ ప్రేక్షకాభిమానులకు అమితాసక్తిని కలిగిస్తున్న చిత్రం, బాహుబలికి చెందిన కీలక సీన్లు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలోకి చిన్న చిన్న వీడియోల రూపంలో ఎక్కేస్తున్నాయి. ఇప్పటికే రానాకు రాజమాత శివగామి స్వయంగా పట్టం కడుతున్న సీన్ చక్కర్లు కొడుతుండగా, ఈ చిత్రానికి చెందిన కథ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఓ సీక్రెట్ కూడా రివీల్ అయింది. దేవసేన (అనుష్క) కట్టప్ప కూతురేనట. మొదటి భాగంలో ఎంతమాత్రమూ ప్రస్తావించకుండా వదిలేసి, రెండో భాగంలో రివీల్ చేసిన అతిపెద్ద సీక్రెట్ ఇదేనని కూడా పలువురు పోస్టులను పంచుకుంటున్నారు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయాన్ని కూడా వెల్లడిస్తున్నారు. ఆ విషయాన్ని సస్పెన్స్ గానే ఉంచాలన్న ఆలోచనతో 'ఏపీ7ఏఎం' ప్రేక్షకులకు దాన్ని పంచుకోవడం లేదు.