: 'బాహుబలి'ని చూసిన కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడి మాటలు!


బాహుబలి సినిమాను చూసేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ చిత్రాన్ని ఇప్పటికే చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల్లో కొందరు చిత్రం అద్భుతమని కొనియాడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడొకరు, 'డీఎన్ఏ' పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు మూడు గంటల పాటు చిత్రం సాగిందని, ఒక్క కట్ కూడా చెప్పకుండా చిత్రాన్ని ఓకే చేశామని అన్నారు.

 ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కన్నా ఈ చిత్రం బాగుందని, యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకన్నా బాగున్నాయని అన్నారు. ఇక ఈ దశాబ్దపు అతిపెద్ద సినీ ప్రశ్నకు సమాధానం సినిమా చూస్తున్న వారిని ఆశ్చర్య పోయేలా చేస్తుందని, ఆ విషయాన్ని మాత్రం థియేటర్ లోనే చూసి తెలుసుకోవాలని చెప్పారు. రెండు నట సింహాలు పోటీ పడిన తీరును ప్రభాస్, రానాల మధ్య చూపారని అన్నాడు. కొన్ని సీన్లలో ప్రేక్షకులు కంటతడి కూడా పెడతారని అన్నారు. ఈ సినిమాకు 5కు 5 రేటింగ్ ఇస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News