: వినోద్ ఖ‌న్నా మృతికి సంతాపం.. బాహుబ‌లి-2 ప్రీమియర్ షో ర‌ద్దు: క‌ర‌ణ్ జొహార్


కేన్సర్‌తో బాధ‌ప‌డుతూ కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ న‌టుడు, నిర్మాత వినోద్ ఖన్నా ఈ రోజు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసింది. ఈ క్రమంలో, ఈ రోజు రాత్రి ప్ర‌ద‌ర్శింప‌త‌ల‌పెట్టిన బాహుబ‌లి-2 ప్రీమియర్ షోను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత క‌ర‌ణ్ జొహార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించారు. బాహుబ‌లి టీమ్ అంతా వినోద్ ఖ‌న్నా మృతి ప‌ట్ల సంతాపం తెలుపుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  


  • Loading...

More Telugu News