: భర్త తలను నరికి.. పోలీసులకు లొంగిపోయిన భార్య


భార్య తన భర్త తలను నరికి, అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం తడకొండ గ్రామంలో ఈ ఉదయం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా దయ్యాల లచ్చయ్య (60), దయ్యాల బాలవ్వ అనే దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా విసిగిపోయిన బాలవ్వ తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. నిద్రపోతున్న తన భర్త తలను గొడ్డలితో నరికేసింది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News