: అమరావతి సీఆర్డీఏ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన.. ఉద్రిక్తత!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉన్న సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కార్యాలయం వద్ద కూరగాయలు పారబోసి నిరసన తెలిపారు. సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు రైతులు ప్రయత్నించగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాజధానికి భూములు ఇచ్చేందుకు తాము నిరాకరిస్తున్నా... బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.