: మంత్రి అయ్యాక ఎమ్మెల్యేలతో లోకేష్ తొలి సమావేశం


టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. పార్టీ, ప్రభుత్వంపై పట్టుపెంచుకునేందుకు లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగా, మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యేలతో ఆయన నిర్వహించిన తొలిసమావేశం ఇది కావడం విశేషం. అమరావతిలోని సచివాలయం సెకెండ్ బ్లాక్ మీటింగ్ హాల్ లో నిర్వహించిన ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల సలహాలు, సూచనలను మంత్రి లోకేష్ తీసుకున్నారు. ఈ సమావేశంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు పాల్గొనడం విశేషం. 

  • Loading...

More Telugu News