: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా కన్నుమూత


ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత వినోద్ ఖన్నా కొద్దిసేపటి క్రితం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన, వ్యాధి మరింతగా పెరిగి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా, 2014లో గురుదాస్ పూర్ నుంచి వినోద్ ఖన్నా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. మొత్తం 141 చిత్రాల్లో నటించిన ఆయన, పలు చిత్రాలను స్వయంగా నిర్మించారు. ఇటీవల పూర్తిగా బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. వినోద్ ఖన్నా మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News