: హిందూ దేవాలయాల చుట్టూ బలమైన గోడలు కట్టండి: యోగి ఆదిత్యనాథ్ కొత్త ఆదేశం


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల చుట్టూ బలమైన గోడలను నిర్మించాలని, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన, హిందువులు పూజించే పవిత్ర ప్రదేశాల చుట్టూ రక్షణ కల్పించాలని ఆదేశించారు. జూన్ 2018లోగా అయోధ్యలో 'భజన్ సంధ్య' కేంద్రాన్ని నిర్మించాలని, చిత్రకూట్ చుట్టూ ప్రదక్షిణ మార్గం 'పరిక్రమ'ను పూర్తి చేయాలని అందుకు రూ. 14.77 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

 ప్రముఖ దేవాలయాలకు దారితీసే రహదారులను నాలుగు లైన్లుగా మార్చి మెరుగు పరచాలని, భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, మంచి నీటి సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఎన్నో ఏళ్ల క్రితమే ఆగిపోయిన ప్రపంచ ప్రసిద్ధ 'రామ్ లీల'ను అయోధ్యలోనూ జరిపించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. మధురలో 'రాసలీల' తిరిగి ప్రారంభించాలని సూచించారు. దేవాలయాలకు సమీపంలో ఉన్న పుష్కరణిలను తక్షణమే శుభ్రపరచాలని ఆదేశించారు. కాశీ విశ్వేశ్వరునికి ఈ-పూజ, ఈ-డొనేషన్ వంటి సౌకర్యాలను కల్పించాలని సాంకేతిక విభాగాన్ని ఆదేశించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలని భావించే వారు ఆన్ లైన్లో దరఖాస్తులు పంపేలా సౌకర్యాలను దగ్గర చేయాలని కూడా ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News