: పూర్తి స్పష్టతతో బాహుబలి కీలక సీన్ లీక్... సగటు ప్రేక్షకుడిలో మరిన్ని ప్రశ్నలు!


ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను బాహుబలి ఫీవర్ కట్టిపడేస్తుండగా, సామాజిక మాధ్యమాల్లో చిత్రానికి సంబంధించిన కీలక సీన్ లీకైంది. పూర్తి స్పష్టతతో ఏదో థియేటరులో చిత్ర ప్రదర్శన జరుగుతున్న వేళ తీసినట్టు తెలుస్తున్న ఈ సీన్ లో, మాహిష్మతి రాజ్యంలో రాజుగా భల్లాలదేవుడు పదవిని చేపట్టే సీన్ ఉంది. అతనికి సైన్యాధికారిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. మాహిష్మతి పురవీధుల్లో వేలాది మంది ప్రజల మధ్య రథంపై భల్లాలదేవుడు వస్తుంటే, కత్తి ధరించి కాపలాగా భాహుబలి ముందు నడుస్తుంటడం, రథంపై వస్తూ భల్లాలదేవుడు కోపంగా దేవసేన (అనుష్క) వైపు చూడటం, ఆపై కట్టప్ప సహా, సైన్యమంతా బాహుబలి ఆదేశాల మేరకు భల్లాలదేవుడికి మోకరిల్లడం కనిపిస్తోంది.

భల్లాలదేవుడికి తిలకం దిద్దిన శివగామి, అతనికి కిరీటం పెట్టే దృశ్యాలూ ఉన్నాయి. ఇక ఈ సీన్ చూస్తే, చిత్రంపై మరిన్ని ప్రశ్నలు ఉద్భవించాయి. రాజుగా బాహుబలిని ఎంపిక చేసిన తరువాత, భల్లాలదేవుడికి పట్టాభిషేకం ఏంటి? ట్రైయిలర్ లో బాహుబలి చేసిన ప్రతిజ్ఞ సంగతేంటి? అసలు శివగామి తన కుమారుడి తలపై కిరీటం ఎందుకు పెడుతుంది? వంటి ప్రశ్నలు కలుగుతున్నాయి. వీటికి సమాధానం తెలుసుకోవాలంటే, మరికొన్ని గంటలు ఆగక తప్పదేమో!

  • Loading...

More Telugu News