: మొగల్తూరులోని ప్రభాస్ ఇంటి వద్ద పండుగ వాతావరణం.. భారీ కార్యక్రమాలు చేపడుతున్న అభిమానులు!


'బాహుబలి-2' సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రభాస్ సొంతూరు అయిన మొగల్తూరు (పశ్చిమగోదావరి జిల్లా)లో సందడి నెలకొంది. ఆ ఊర్లోని ఆయన ఇంటి వద్ద అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. ప్రభాస్ ఇంటి వద్ద, మొగల్తూరు సెంటర్, శ్రీదేవి జానకి థియేటర్ లతో పాటు మండలంలోని పలు గ్రామాల కూడళ్లలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి తోడు రేపు పాతపాడు గ్రామం నుంచి నరసాపురం అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని జిల్లా రెబెల్ స్టార్స్ అభిమాన సంఘాల అధ్యక్షుడు చింతపల్లి రవికుమార్ తెలిపారు.

ప్రభాస్ నివాసం, పాత కాలువ, గాంధీ బొమ్మల సెంటర్, స్థానిక థియేటర్ల వద్ద భారీ కేక్ కట్ చేస్తామని, తీన్ మార్ డప్పులు, వాయిద్యాలతో విజయ యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. నరసాపురంలో జరిగే ముగింపు యాత్రకు ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు హాజరవుతారని తెలిపారు. సినిమా విడుదల సందర్భంగా మొగల్తూరులో ఉన్న ప్రభాస్ కుటుంబసభ్యులు, బంధువులంతా థియేటర్ వద్దకు వస్తారని చెప్పారు. 

  • Loading...

More Telugu News