: గర్ల్ ఫ్రెండ్ చేసిన మోసాన్ని వెరైటీగా ప్రపంచానికి చూపిన అమెరికన్!
తన గర్ల్ ఫ్రెండ్ మరొకరితో కనిపిస్తే, అది కూడా బెడ్ పై ఆదమరచి నిద్రిస్తూ కనిపిస్తే, ఎవరైనా ఏం చేస్తారు? అరచి నానాయాగీ చేసి, వారి పరువు తీసేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఓ అమెరికన్ మాత్రం, వెరైటీగా ప్రవర్తించి, ఆమె తనకు చేస్తున్న మోసాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేశాడు. అతని పేరు డూస్టన్ హాలోవే. వయసు 23 ఏళ్లు. తన స్నేహితురాలిని, ఆమెతో ఉన్న యువకుడిని నిద్రలేపకుండా, తన సెల్ ఫోన్ కు పని పెట్టడమే, ఇప్పుడు అతను చేసిన పనిని వైరల్ చేసింది. వారితో గొడవ పెట్టుకోవాలని తొలుత భావించిన డుస్టన్, అంతకన్నా ముందు వారి నిర్వాకాన్ని ప్రపంచానికి చూపాలనుకున్నాడు.
తన గర్ల్ ఫ్రెండ్, ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ లు నిద్రిస్తుంటే, సెల్ఫీలు దిగాడు. వాటిని వెంటనే ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. "మీరు ఇంటికి వచ్చే వరకు, మీరెంతో ప్రేమించిన వారు మరో మనిషితో బెడ్ పై ఉంటే..? మంచి వాళ్లు, మంచి యువతులను గౌరవిస్తారు" అని క్యాప్షన్ పెట్టాడు. ఇక డూస్టన్ పోస్టులు వైరల్ అయ్యాయి. ఎంతో మంది అతనికి మద్దతుగా నిలిచారు. గొడవ చేయకుండా సోషల్ మీడియాను ఆశ్రయించిన అతని మంచితనాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. "జరిగిందంతా నీ మంచికే" అనుకోవాలని సలహాలు ఇచ్చారు.