: అనూహ్యంగా పుంజుకుని రెండో స్థానానికి చేరిన ఆప్... ఢిల్లీ ఎన్నికల తుది ఫలితాలు


నిన్న ఓట్ల లెక్కింపు ప్రారంభించిన సమయంలో మూడో స్థానంలో కొనసాగిన ఆమ్ ఆద్మీ పార్టీ, లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి అనూహ్యంగా పుంజుకుంది. రెండో స్థానానికి చేరి, కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికి పరిమితం చేసింది. మొత్తం 270 స్థానాలకు ఎన్నికలు జరుగగా, తుది ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ 181 స్థానాల్లో, ఆప్ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 30 స్థానాల్లో, ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందారు. మొత్తం మూడు కార్పొరేషన్ల పరిధిలో 2,537 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాగా, ఈ విజయం ప్రజలదేనని, వారు తమపై పెట్టుకున్న విశ్వాసానికి నిదర్శనమని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ టీమ్ కృషి ఫలించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈవీఎంల కారణంగానే తాము ఓడిపోయామని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News