: ఆకాశం నుంచి టీఆర్ఎస్ సభపై పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు పూర్తి
వరంగల్ లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ప్లీనరీపై పూలవర్షం కురిపించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించి, పర్యవేక్షించారు. పారాగ్లైడర్లు పారామోటార్ తో నింగిలోకి దూసుకెళ్లి లక్ష్యంపై సరిగ్గా పూలవర్షం కురిపించారు. ఆకాశం నుంచి పూల వర్షం కురవడంపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ను ఆశ్చర్యంలో ముంచెత్తేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. చారిత్రాత్మకమైన టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ క్యాడర్ మొత్తాన్ని పూలవర్షంలో ముంచెత్తి సత్కరిస్తామని పార్టీ నేతలు తెలిపారు.