: నాపై అసత్య వార్తలు ఆపండి: ఆనం రామనారాయణరెడ్డి
తమ కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడనున్నదని వస్తున్న వార్తలు పూర్తి నిరాధారమని, ఈ తరహా అసత్య ప్రచారాన్ని ఆపాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. గత రెండు మూడు రోజులుగా తాను వైకాపాలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన, తాను, తన సోదరుడు చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తామని, టీడీపీలోనే ఉంటామని అన్నారు. పత్రికల్లో వార్తలకు ఆధారాలు లేవని చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తామంతా కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే విషయంలో అందరితో కలసి కృషి చేస్తామని వెల్లడించారు.