: బాహుబలి మేనియాతో క్యూ కట్టిన సినీ ప్రేమికులు... ప్రేక్షకులను బాదేస్తున్న నిర్మాతలు
బాహుబలి మేనియాలో తెలుగు సినీ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. తొలిరోజు తొలిషో చూసేసి, సోషల్ మీడియాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపేశాడన్న విషయం తెలుసుకోవాలని తొందరపడుతున్నారు. ఈ మేనియాను నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకు విశేష ప్రచారం కల్పించడం ద్వారా అభిమానుల్లో ఆసక్తి పెంచిన నిర్మాతలు సినిమా నిర్మాణానికి చాలా ఖర్చు చేశామని, టికెట్ల ధరలు పెంచకుంటే నష్టపోతామని...తమను కష్టాల నుంచి గట్టెక్కించాలంటే స్వల్పంగా టికెట్ల ధరలు పెంచాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
వారి వాదనలు విన్న హైకోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. అంతే.. వెంటనే బాహుబలి నిర్మాతలకు రెక్కలు వచ్చాయి. దీంతో అధికారికంగా టికెట్ పై 20 రూపాయలు పెంచినట్టు ప్రకటించారు. తొలి వారంరోజులపాటు ఒక్కోటికెట్ పై 20 రూపాయలు పెరుగుతుందని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటి వరకు 80 రూపాయలుగా ఉన్న టికెట్ 100కు... 40 రూపాయలుగా ఉన్న టికెట్ 60 రూపాయలకు చేరింది.