: భారత్‌లో చొరబాటుకు సిద్ధంగా 150 మంది పాక్ ఉగ్రవాదులు: ఆర్మీ


భారత్‌లో భారీ దాడులకు సిద్ధమైన పాక్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉన్న వీరంతా సమయం కోసం వేచి చూస్తున్నట్టు నిఘావర్గాల నుంచి తమకు సమాచారం అందినట్టు ఆర్మీ పేర్కొంది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉగ్రవాదుల చొరబాట్లు తగ్గాయని పేర్కొన్న ఆర్మీ విపరీతంగా కురుస్తున్న మంచు కూడా ఇందుకు ఓ కారణమని పేర్కొంది.

  • Loading...

More Telugu News