: ఆసుపత్రిలో వున్న విద్యాసాగర్‌రావు కోరిక తీర్చిన కేసీఆర్!


అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నీటిపారుదల సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు కోరికను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారు. ఆయన కోరిక మేరకు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై బుధవారం సీఎం సంతకం చేశారు. ఆమధ్య కేసీఆర్‌ను కలిసిన విద్యాసాగర్‌రావు అర్వపల్లి ఆలయాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరారు. దీంతో స్పందించిన కేసీఆర్ నిధులు మంజూరు  చేశారు.

  • Loading...

More Telugu News