: రాబిన్ ఊతప్ప వన్ మ్యాన్ షో...కోల్ కతా విజయం


కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప వన్ మ్యాన్ షోతో అదరగొట్టి జట్టుకు తిరుగులేని విజయం అందించాడు. పూణే వేదికగా జరిగిన మ్యాచ్ లో పూణే సూపర్ జెయింట్ కు ఓపెనర్లు, రాహుల్‌ త్రిపాఠి (38), అజింక్యా రహానే (46) శుభారంభం ఇచ్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ (51), మహేంద్ర సింగ్ ధోనీ (23) ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో అజింక్యా రహనే, ధోనీ, మనోజ్‌ తివారీని కోల్‌ కతా వికెట్‌ కీపర్‌ ఉతప్ప స్టంపౌట్‌ చేసి ఆకట్టుకున్నాడు.

అనంతరం 184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ కు ఓపెనర్లు సునీల్ నరైన్‌ (16) గౌతమ్ గంభీర్ (62) ఆకట్టుకునే ఆరంభం ఇవ్వగా, తరువాత క్రీజులోకి వచ్చిన  రాబిన్ ఊతప్ప పూణే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. చివర్లో బ్రావో, మనీశ్‌ పాండే ధాటిగా ఆడి ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే పూణేపై విజయం సాధించారు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రాబిన్ ఊతప్ప నిలిచాడు. 

  • Loading...

More Telugu News