: చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో కూలిన విమానం
ఛత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లా చంతగూఫా ప్రాంతంలో హెలికాప్టర్ కూలడంతో కలకలం రేగుతోంది. ఇటీవల మావోయిస్టులు సీఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ప్రత్యేకదళాలు గాలింపు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందడంతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మావోయిస్టుల కోసం అడవుల్లో గాలింపు చేపడుతున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో కుప్పకూలినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు కోబ్రా కమాండోలు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.