: అంతరిక్షంలో శాండ్ విచ్ తయారుచేసిన వ్యోమగామి... మేకింగ్ వీడియో ఇదిగో!
పాశ్చాత్య దేశాల్లో శాండ్ విచ్ ను ఆహారంగా తీసుకుంటారు. నాసాకు చెందిన వ్యోమగామి షేన్ కిమ్ బ్రోగ్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్‌ఎస్) లో వేరుశెనగ, వెన్నతో జెల్లీ శాండ్ విచ్ తయారు చేశారు. 173 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన ఆయన ఏప్రిల్ 10న కజకిస్థాన్ లో సురక్షితంగా దిగారు. అంతకు ముందు తాను అంతరిక్షంలో ఉండగా తయారు చేసిన జెల్లీ శాండ్ విచ్ వీడియోను ఏప్రిల్ 21న విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అంతరిక్షంలో వస్తువులు ఎలా ఎగురుతాయో కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను మీరు కూడా చూడండి.