: కేసీఆర్ పెయింటింగ్‌ను ట్వీట్ చేసిన కేటీఆర్.. కోట్లాదిమందికి ధన్యవాదాలు
తెలంగాణ ఉద్యమ యోధుడి నుంచి ఉత్తమ పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మారారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేస్తూ దానికి కేసీఆర్ పెయింటింగ్‌ను జత చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను తమ నాయకుడు తీర్చాడని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కలను సాకారం చేసిన కోట్లాదిమందికి ట్వీట్ ద్వారా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.