: టీజేఏసీ రాజకీయ పార్టీగా ఏర్పడే అవకాశం లేదు: ప్రొఫెసర్ కోదండరామ్


టీజేఏసీ రాజకీయ పార్టీగా ఏర్పడే అవకాశం లేదని ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన తనకు లేదని, టీజేఏసీ ఎప్పటికీ ప్రజా సంస్థగానే పని చేస్తుందని అన్నారు. రైతులకు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడి పథకాన్ని స్వాగతిస్తున్నామని, రైతులకు ఏమాత్రం సాయం అందినా హర్షిస్తామని, పూర్తి స్థాయి వ్యవసాయ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నెం.123కు సవరణ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశాలనే మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్న విషయాన్ని కోదండరామ్ ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News