: ‘బాహుబలి-2’ తమిళ వెర్షన్ దృశ్యాల లీక్!
‘బాహుబలి-2’ తమిళ వెర్షన్ సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఒకటిన్నర నిమిషం దృశ్యాలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి లీకేజ్ జరగలేదంటూ సినిమా యూనిట్ ప్రకటించిన కొంచెం సేపటికే ‘బాహుబలి-2’ చిత్రానికి సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్ లో కన్పించడం గమనార్హం.