: విజయవాడలోని మహిళా, బాలికల వసతి గృహాల నిర్వాహకులకు పోలీస్ ఆదేశాలు!


విజయవాడలోని మహిళా, బాలికల వసతి గృహాల నిర్వాహకులు వెంటనే అనుమతులు తీసుకోవాలని సీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం వసతి గృహాల్లో భద్రత, ప్రమాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, సంబంధిత ప్రభుత్వ శాఖతో నెల వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, వసతి గృహాల్లో మహిళా వార్డెన్, సెక్యూరిటీ గార్డు, సీసీ టీవీలు తప్పక ఏర్పాటు చేయాలని, వసతి గృహంలో ఉంటున్న మహిళల వివరాలతో రిజిస్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పదిహేను రోజుల్లోగా ఇక్కడి మహిళా,బాలికల వసతి గృహాలపై తనిఖీలు చేపట్టనున్నట్టు గౌతమ్ సవాంగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News