: ప్రధాన ప్రతిపక్ష గౌరవాన్ని వైసీపీ కోల్పోయింది: మంత్రి నక్కా ఆనంద్ బాబు


దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగినా లేక ముందస్తు ఎన్నికలు జరిగినా త‌మ పార్టీదే విజ‌యం అని టీడీపీ నేత‌, ఏపీ మంత్రి న‌క్కా ఆనంద్ బాబు ధీమా వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న‌ గుంటూరులో పెండింగ్‌లో ఉన్న పలు కార్యక్రమాలపై అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష గౌరవాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని అన్నారు. త‌మ సర్కారు రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌ని గెలిపిస్తాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. గుంటూరు న‌గరంలో నిర్మాణ దశలో ఉన్న అంబేద్కర్‌ భవనానికి రాష్ట్ర స‌ర్కారు రూ.6 కోట్ల నిధులు కేటాయించింద‌ని  అన్నారు.

  • Loading...

More Telugu News