: 28 మిలియన్ లీటర్ల జ్యూస్ రోడ్లపైకి వచ్చేసింది!
మామిడి, పైనాపిల్, ఆపిల్, దానిమ్మ లాంటి ఎన్నో పండ్ల రసాలు లీటర్ల కొద్దీ రోడ్లపైకి వచ్చేయడంతో ఆ ప్రాంతం అంతా వర్షపు నీటితో నిండిన ప్రదేశంలా కనిపించిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఆ దేశంలోని పెప్సికోకి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఏడో ఫ్యాక్టరీ అయిన లెబెడ్‌యాన్సీక జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించిన పండ్ల రసాలు ఇలా వృథా అయిపోయాయి. ఆ ఫ్యాక్టరీలో 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పైకప్పు కూలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 28 మిలియన్ లీటర్ల జ్యూస్ రోడ్లపైకి వచ్చేసిందని ఆ ఫ్యాక్టరీ ప్రతినిధులు చెప్పారు. ఆ ఫ్యాక్టరీలో జరిగిన ఇటువంటి ఘటనల్లో ఇద్దరు కార్మికులు నాలుగు గంటల పాటు ఇరుక్కుపోయారు. అక్కడకు చేరుకున్న సహాయక సిబ్బంది రోడ్లపై పారుతున్న రసాన్ని తొలగించారు.