: చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి!: కేజ్రీవాల్‌పై అన్నా హజారే విసుర్లు
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఆయన ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి సారించలేదని అన్నా హజారే వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారని, గతంలో ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ చెప్పినదానికి, ఇప్పుడు చేస్తున్నదానికి పోలికలేదని విమర్శించారు.