: మహిళతో మహిళకు పెళ్లి.. తరలివచ్చిన బంధుమిత్రులు!
పంజాబ్లో ఓ విచిత్ర పెళ్లి వేడుక జరిగింది. ఓ మహిళ మెడలో మరో మహిళ తాళి కట్టి ఆమెను తన భార్యగా స్వీకరించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారిని అయిన మంజీత్ కౌర్ సంధూ హిందూ సంప్రదాయం ప్రకారం జలంధర్ నగరంలో 27 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధుమిత్రులు హాజరయ్యారు. ఓ మహిళతో మరో మహిళకు పెళ్లి కావడంతో వారి వివాహ వేడుక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పెళ్లిని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్వలింగ వివాహాలు నేరం అని మరికొందరు అంటున్నారు.