: హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టేసిన 'బాహుబలి-2'


భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న 'బాహుబలి-2' సినిమా మన దేశంలోనే కాదు... ఓవర్సీస్ లో సైతం రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ లో రికార్డులు సృష్టించిన 'బాహుబలి-2' అడ్వాన్స్ బుకింగ్స్ లో సైతం సత్తా చాటింది. విదేశాల్లో సైతం రికార్డు స్థాయిలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగులు అవుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పలు హాలీవుడ్ సినిమాలను మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ గులాన్ మాట్లాడుతూ, రీసెంట్ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8'కి కూడా ఈ స్థాయిలో బుకింగ్స్ జరగలేదని చెప్పాడు. లక్షకు పైగా టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయని తెలిపాడు. 

  • Loading...

More Telugu News