: 110 కోట్ల జీబీ డేటా వాడుతున్నారు: రిలయన్స్ జియో


టెలికాం మార్కెట్లో రిల‌య‌న్స్ జియో గుప్పిస్తోన్న ఆఫ‌ర్ల ప్ర‌భావంతో జియో వినియోగ‌దారుల సంఖ్య 100 మిలియ‌న్‌ల‌కి చేరిన విష‌యం తెలిసిందే. అయితే, త‌మ నెట్‌వర్క్‌ పరిధిలో యూజ‌ర్లు వినియోగిస్తోన్న డేటా గురించి రిల‌య‌న్స్ జియో ప‌లు వివ‌రాలు తెలిపింది. జియో యూజ‌ర్లు అంద‌రూ క‌లిసి నెల‌కు 110 కోట్ల జీబీ డేటాను వాడేస్తున్నార‌ని పేర్కొంది. మ‌రోవైపు జియో రోజుకు 220 కోట్ల వాయిస్‌, వీడియో నిమిషాలను అందిస్తున్నట్లు తెలిపింది. తాము ప్ర‌పంచంలోనే చవకైన, అత్యంత నాణ్యమైన స‌ర్వీసుని అందిస్తున్న‌ట్లు రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తెలిపారు.

  • Loading...

More Telugu News