: సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపిన పీసీ చాకో
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆప్ డీలా పడగా, కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు పుడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీపీ చాకో తన రాజీనామా లేఖను అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఢిల్లీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు.