: ఆవుకు ఆపరేషన్.. కడుపులో నలభై కిలోల ప్లాస్టిక్ కవర్లు!


ఆవు కడుపులో నలభై కిలోల ప్లాస్టిక్ కవర్లు ఉన్న ఆశ్చర్యకర సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. నిజామాబాద్ లోని స్థానిక ఎల్లమ్మగుట్టకు చెందిన న్యాలం భాస్కర్ అనే రైతుకు చెందిన ఆవు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉంది. అప్పటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో వెటర్నరీ వైద్యుడు రాజేష్ ను సంప్రదించారు. ఆవును పరీక్షించిన సదరు వైద్యుడు .. దాని కడుపులో ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్టు గుర్తించారు. సదరు రైతు అంగీకారం మేరకు, ఆవుకు ఆపరేషన్ నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను బయటకు తీశారు. అయితే, ఒకటో, రెండో ప్లాస్టిక్ కవర్లు కాదు, దాని కడుపులో వున్నది .. నలభై కిలోల బరువు తూగే కవర్లు. దీంతో, వైద్యులు సహా సదరు యజమానీ ఆశ్చర్యపోయారు.

  • Loading...

More Telugu News